"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

26 ఏప్రి, 2013

తుది ప్రయాణం...

ఒక మనిషి బ్రతకడానికి 
ఇన్ని వస్తువులు కావాలా ?
మనసులో సౌందర్యం కి 
బయట కనిపించే రంగులెన్ని ?

చిన్న ఆశ చాలు కదా ,గుప్పెడంత 
ఇంత పెద్ద గృహం కావాలా ?
మనిషి శాంతి గా బ్రతకడానికి .. 
ఆత్మ కి ఎంత చోటు కావాలో ? 

సర్వ అవయవాలు చాలు కదా 
ఆస్తి గా ? నయనాలే కోట్ల ఆస్తి , 
నలుగురికి ప్రదర్సన ,ఏదో ఒక 
ఎక్షిబిషన్ లాగ ? నిన్ను నువ్వే 
ప్రదర్శించు కోవడం ,ఒక నిత్య కృత్యం . 

కావలసినంత అంటే ఎంతో 
ఎవరైనా చెపుతారా ? మనం 
దూర ప్రయాణం కి ఎంత మోసుకు
వెళతామో , లెస్ లగేజ్ ,మోర్ కొమఫోర్ట్ 
అంటూనే ఉన్నారు. 

ఇవాల్టికి ,రేపటికి ,ఎల్లుండికి 
ఇంకా మరో తరానికి ఒక అంతు లేదు 
అలా ఎదిగి పోవడమే , చెట్టు చూడు 
తను మోసెంత వరకే ఎదుగుతుంది . 

చెట్టు లా ఎదిగేం కాని ,చెట్టుకి ఉన్నంత 
జ్ఞానం కూడా లేదు, అయినా ఈ రోజు 
ఈ పురిటి వైరాగ్యం ,నాకు తెలుసు 
ఈ నాటి తో సరి. 

రేపటి కోసం అప్పుడే కలలు ,
అప్పుడే వస్తువులు ,ఈ అనంత 
ప్రయాణం లో నన్ను కప్పెట్టే అన్ని 
వస్తువులు, ఎప్పుడో భారం అనిపించి 

ఆ తుది ప్రయాణం లో ,అన్ని ఒక్కొక్కటి 
జార్చేస్తాను, నా బరువు ఒక్కటి నాకు చాలు 
అనిపించే ఆ తుది ప్రయాణం కి 
మరికొన్ని మెట్లు తయారు చేస్తాను ఇదిగో ,
వస్తున్నా.. వస్తున్నా.. 





2 కామెంట్‌లు:

  1. చెట్టు లా ఎదిగేం కాని ,చెట్టుకి ఉన్నంత
    జ్ఞానం కూడా లేదు......నిజమే.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. థాంక్ యూ డేవిడ్
      చెట్టు మనకి ఉపయోగిస్తుందే తప్ప హాని చేయదు
      ఒక్క మనిషే అంతా నాశనం చేసుకుంటూ, అదే అభివృద్ధి అని
      తలుస్తున్నాడు.

      వసంతం.

      తొలగించండి