"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

10 మార్చి, 2013

ఆనంద తాండవం....

నాట్యం చేస్తూ .. 
విశ్వ మండలం పై 
ధ్వంస రచన కై 
సన్నధమై ,
డమరుకం దడ దడ 
లాడిస్తూ, శబ్దం కి ఆది 
ఆ డమురుక నాదం 
విచ్చలివిడిగా ప్రకృతి 
నాశనం చేసే నరుడి 
అమాయకత్వమా ?
అసహనమా? లేక 
అహంకారామా ? 
ఏదయినా ఇంక 
సహించేది లేదు, 
లయ నర్తనం మొదలయింది 
అశాంతి, అధర్మం , అన్యాయం 
అన్నిటిని నర్తించే పాదాల 
కింద తొక్కి పెట్టి ,
ఖండించి ,తునకలు తునకలు గా 
లయ నర్తనం .. 
అగ్ని కీలలు ముట్టించి 
చెడు నంతా మండించి 
మరు భూమి నుండి 
లయ తో ఆరంభమైన 
ఈ పద నర్తనం , 
ప్రకృతి  నవ వసంతం 
కి సంకేతం అయి ,
కిల కిల రావాలతో ,నిత్యం 
తొణికిసలాడే జీవ యుగం 
శ్రీకారం కి తొలి అడుగు 
ఆ నర్తన ... 
ఆనంద తాండవం చేసే 
ఆ విభూది నాయకుడి
నర్తన వైభవం కి 
సమాయత్తం కండహో .. 
అని జనం ,ప్రభంజనం 
కి ఒకే ఒక శంఖారావం 
ఒకే ఒక మహారంభం . 
ఈ నర్తన మాగదు .. 
ప్రక్షాళన పూర్తి 
అవాల్సిందే . ఈ లయ 
నర్తనం కి తుది మొదలు 
అంటూ ఏమి లేదు 
ఈ విశ్వ గోళం చేసే 
సడి ,లయ , ఈ భోగోళం 
చేసే ప్రతిచర్య నాదం .. 
ఈ లయ ,ఈ నాదం 
అడుగులో అడుగు తో 
నృత్యం తిల్ల్లనా 
ఈ నాట్య భంగిమలు 
ఏమాత్రం సంతులనం 
కోల్పోయినా , ఈ నాట్య 
భంగిమ అపసవ్యం 
ఈ నృత్యం ,ఒక లయ కారకం 
ఒక ఆఖరి ప్రదర్శన .. 

ప్రతి క్షణం ,ప్రతి లిప్త 
ఒక నృత్య భంగిమ 
ఆ నాట్య ప్రవాహం లో 
లీనమై , అడుగు లో 
అడుగు వేయడమే 
ప్రకృతి ధర్మం .. 

ప్రకృతి గతి తప్పితే 
వికృతి ఏ గతి .. 
ఏ ముద్ర ,ఏ భంగిమ 
వేసినా నీ ఉనికి మొత్తం 
ప్రకృతి కి అనుకూలం గా 
ప్రకృతి తో మమేకం గా 
బ్రతికితే ఈ సృష్టి చేసే 
చిందుల నాట్యం నీ సొంతం .. 
ఇదే నా ఈ శివ రాత్రి 
సందేశం ...ఇంతేనేమో .. 









కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి