"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

6 మార్చి, 2013

ఇదే ,ఇదే మన భారత దేశం..


ఆ చిత్రం లో బట్టలు విప్పేరు 
భారత మాత కి అని బాధ 
పడి ,పొరలు పొరలు గా 
బట్టలు కడతాం..

ఇదిగో, ఈమె చూడండి 
నగ్నం గా, బట్టలూడదీసి 
దిస మొల తో చెట్టుకి 
వేలాడ దీసారు..చూడండి 

బాగా చూడండి , మానం 
ట ,అది ఎక్కడుందో అని 
వెతుకుతూ చూడండి ..
ఒక దళిత వనిత ట ..

ఆడ వారి మానం అంటే...
మీ మన ఇళ్ళ లలో వారే 
వారి ప్రేమ లకి సంకెళ్ళు 
వారి స్నేహాలకి ఫుల్ స్టాప్ లు..

ఒకే కులం, మరో గోత్రం 
మనం చెప్పిన వరుడే 
ఆమె ని ముట్టుకునే 
మగ పురుగు ..మరో డెవరయినా 

కన్నెత్తి చూస్తే మా ఇంటి 
ఆడ పిల్లని, కళ్ళు కట్టేస్తాం..
మేము మటుకు ఇలా 
మనసు పడిన ఆ ఊరి 

చివర మాల దాన్నో, 
మరో .....దాన్నో, మోజు 
పడితే, గింజుకుని అరుస్తుందా 
పోలీసు ,కేసు అంటుందా..

అందుకే ,బుద్ధి వచ్చేలా 
అందరికి ఇదిగో ఖబడ్దార్..
అంటూ ..ఇలా చెట్టుకి ఉరి 
వేసి దిస మొలతో,ఉరి వేసాం ..

హ్మ్మ్మ్మ్మ్మ్మ్...
కడుపు లోంచి ఆక్రోశం ..
తన్నుకుని వచ్చిన క్రోధం 
ఒరేయ్ ,నిన్ను ముంచేసే 
రోజు వస్తోంది రా..

నిన్ను ఆఖరి  రాయి 
వరకూ తరుముకుని వెళతాం..
నీ అధికారానికి మా 
కాళ్ళతో తొక్కి జవాబు 
చెపుతామ్.. 
ఖబడ్దార్ కామంధుడా .. 
ఇదే మా చివరి ,చిట్టచివరి 
హెచ్చరిక .. కాసుకొ.. 



చెట్టు కి వేలాడ దీసిన ఒక నగ్న దళిత స్త్రీ ఫోటో ఒకటి చూసి, 
ఇది మన భారత దేశం ,మనం ఒప్పుకున్నా 
ఒప్పుకోక పోయినా ... 





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి