"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

2 మార్చి, 2013

నిన్ను నువ్వు కాపాడుకో చెల్లి, మగువా.. ఓ స్త్రీ..

మగాడు తిరగక చెడాడు, ఆడది తిరిగి చెడింది 
అంటూ మహిళ కి మేని ముసుగులు, 
కనిపించని సంకెళ్ళు వేసి ఇంట్లో కూర్చో 
బెట్టి, నీకు అసలు ప్రపంచ జ్ఞానం లేదు సుమీ ?
అనడాన్ని ఎలా ?అర్ధం చేసుకుంటాం ? 

మౌనం నీకు ఆభరణమని ,ఓర్పు నీకు 
సహజమయిన అలంకరణ అని, 
అమ్మతనం ఇంకో పెద్ద కిరీటం అని 
కీర్తించి, అయిదోతనం లోనే అన్ని సుఖాలు 
అని ఒప్పించి, వంటిల్లు నీ రాజ్యం ,ఆ 
రాజ్యం లోకి ఎవరు అడుగు పెట్టినా ,పోరాడు 
అని నేర్పించి, మగువలు ముద్దుగా నేర్పిస్తే 
ఏ విద్య అయినా యిట్టె ,యిట్టె నేర్చుకుంటారు 
అని పొగిడి, ఇంటి కోడలు నీ శత్రువు అని 
మప్పి, ఆస్తి ఎందుకు ? డబ్బు పాపిష్టి ది 
నీ చేతుల్లో ఎందుకు? మేమున్నాం గా అంటూ 

సర్వ అధికారాలు ,మగ వాడు చేపట్టి, 
నీకు ఎందుకు చెప్పు, ఈ లౌకిక మైన 
తుచ్చమైన , విషయాలు, హాయిగా 
కృష్ణా ,రామా, దేవుడా అంటూ పూజలు ,
వ్రతాలు చేసుకో, పతి దేవుడినే కొలుచుకో 
ముత్తై దువులని పిలుచుకో , కొలుచుకో 
కాని, నువ్వెందుకు ఇలా చేసావు అని 
ఎన్నడు పతి ని ప్రస్నించకు .. పాపం .. 
లెంపలు వేసుకో , ఈ పూట కేం వండాలి 
లాంటి పిచ్చి ప్రశ్నలు అడక్కు, నీకు 
సర్వ అధికారాలు ఇచ్చేం కదా ,ఈ గృహ సీమకి 

నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో ..కాసింత రుచిగా 
నాకు ఇష్టమయినవి రెండు అధరువులు ఉంటే చాలు. 
పతి దేవుడి కి ఇష్టమయినవి ,ఏం ఆమాత్రం మేం 
అడగకూడదా ? కష్టపడి ,రోజంతా బయట చెడ 
తిరిగి సంపాదిస్తాం ,మాకు ఈ హక్కు కూడా లేదా?
ఏమిటో ? అలా నీల్గుతారు.. ఇంకేం కావాలి?

కూడు, గుడ్డ, రక్షణ ఇస్తున్నాం కదా , ఆ పాడు 
సమాజం ఎంత దుష్ట మైనదో ,మీకు తెలుసా అసలు 
లేదే ,మేం తిరగం కదా ,మాకు తెలియదు .. 
మా ముందు అందరూ ,చాల మర్యాదగా మాట్లాడుతారే 
అక్కయా, అమ్మా, చెల్లి అంటారే ,అయ్యో ఎంత 
అమాయకులు మీరు, అందుకే మీకు లోకం 
తెలియదు అంటాము .. మరి మేము బయట తిరిగితే 
కదా తెలిసేది, నీకు తెలియదే పిచ్చి మొద్దు.. 


నీ వెనక, చాల వక్రం గా ,చాల నీచం గా మాట్లాడుతారు 
అయ్యో ,ఎందుకండీ అలా?
ఆడ వారు అంటే ఎందుకండీ అంత లోకువ? 
మేం ఏం తప్పు చేసాం? ఇంకా చేయలేదే ,మీరు 
చేస్తారేమో నని, అని నాలుక కరుచుకుని , పోయి 
కాసిని మంచి నీళ్ళు పట్టుకు రా, ఇలా నిలదీయడం 
ఎక్కడ నేర్చుకున్నావు? ఇంకా నయం, చదువు 
ఎక్కువయితే ,ఇంకా ఎన్ని ప్రశ్నలు అడిగేదో? 

పదో తరగతి తో మాన్పించేరు కాబట్టి, మావగారు 
సరిపోయింది . అమ్మాయి డిగ్రీ అంటే , ఎలాగో ?
ఉన్న ఊళ్ళో , అమ్మాయిల కాలేజ్ లో చేరుస్తా 
అయినా ఈ సెల్ ,ఫోన్లు, నెట్ లో బూతు చిత్రాలు 
ఇవన్ని ఎలా పాడు చేస్తున్నాయో ? ఆడ పిల్లలని .. 
మా అబ్బాయి కాని ,చూస్తున్నాడా? ఆ ఏం పోలే 
అబ్బాయి తిరగక చెడాడు .అన్నారు కదా.. 

అదండీ సంగతి , తిరిగి తిరిగి, తిరిగి 
ఇక్కడికే ... అమ్మాయి ఇంట్లో కూర్చోవాలి 
అంటే తప్పేమిటో మీరే చెప్పన్ది. 
ఇల్లు, ఇల్లాలు, పిల్లలు ,ఇంతకన్నా స్వర్గం 
ఎక్కడుంది ? అంతా ఆమె చేతిలోనే ఉంది .. 

అబ్బాయి అంటే బాధ్యత ,మరి తల్లి తండ్రుల ని 
ఎవరు చూస్తున్నారు? కూతుర్లే ..కొడుకులు 
ఉత్త చవటలు, పెళ్ళాం మాట వింటే, 
ఏమిటో, మాట మార్చేస్తారు యిట్టె, యిట్టే .. 
స్వర్గం ఆమె చేతిలోనే ఉంది, నువ్వు చేయనిస్తే 
నరకం చేయదలచు కున్నవా? ఆమె నిన్ను ఆపలేదు. 

జోడు కాడెద్దులు అంటూ, సమానం గా బరువు 
బాధ్యతలు పంచారా? లేదే , ఇల్లే నీకు సర్వస్వం 
అన్నారు, పోనీ ,ఇల్లు ని నడిపించాలని ఉన్నా 
పరి పరి విధాల ఆంక్షలు ,అడ్డంకులు . 
పరిపూర్ణం గా ఎదుగు ,అని చెప్పి, గాలి,ఎండా 
తగలని నీడ లో, కొమ్మలు, ఆకులు కత్తిరించి 
ఇంకా ఇల్లాగే ఉన్నావేం ? అంటూ హేళన చేసే 
సమాజం ఇది, ఓ స్త్రీ, ఓ మగువా ,ఓ వనితా 
నిన్ను నీవు తెలుసుకో ... 
ముందు నీకు కట్టిన సంకెళ్ళు తెంచుకో ,
ముత్తైదువలు అంటూ లేరు, బొట్టు అందరికి 
అలంకారం, ఆస్తి సంబాలించుకో ,నడి రోడ్డు 
పై ,దిక్కు ,దివాణం లేకుండా వదిలేయ గలిగే 
అవకాసం ఎప్పుడూ ఇవ్వకు.. మెలకువ 
తెచ్చుకో ,అమాయకత్వం ,అందం కాదు.. 

నిలదీయడం , నీకు సిగ్గేం కాదు, నిన్ను నువ్వు 
రక్షించు కోవడం పాపం కాదు, నీ చుట్టూ ,
నిన్ను ప్రేమించే వారి సాయం తీసుకో, 
నిన్ను నువ్వు కాపాడుకో చెల్లి, మగువా.. ఓ స్త్రీ.. 












2 కామెంట్‌లు:

  1. మనం ఇతరులనుంచి ఏరకమైన ప్రవర్తనైతే ఆశిస్తామో దాన్ని ఆ ఇతరులకు అత్యంత అభిలషణీయమైనదిగానూ, క్షేమకరమైనదిగానూ, పవిత్ర విధిగానూ, జీవితాదర్శంగానూ మరియు నైతికతగానూ భ్రమింపజేయడం ఒక చక్కటి వ్యూహం. దీన్ని సరిగ్గా plan చేసి అమలుచేస్తే, మనకు లాభంకలిగించేలా ప్రవర్తించడానికి ఆ ఇతరులు తమతమ జీవితాల్ని ధారపోస్తారు. పూర్తిస్థాయిలో ఈ వ్యూహం విజయవంతమైతే మనమీద ఆరోపణలనుకూడా ఇతరులే defend చేస్తూ, వాళ్ళ (ఒకవేళ ఈ మొత్తం తంతుమీద అనుమానాలొస్తే ఆ) అనుమానాలకి వాళ్ళే guilt ఫీలవుతూ మన సేవలో పునరంకితమవుతారు.

    మీరు చెప్పినట్లు ఈ వ్యూహం ఆడవాళ్ళ విషయంలో ఇది చాలా చఖ్ఖగా వాడబడింది. అలాగని దీనికి ఉదాహరణ ఇదొక్కటేకాదండోయ్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Indian Minerva ..gaaru..
      చక్కగా పట్టుకున్నారు . మన పై జరుగుతున్న అవ్య్యాజ ప్రేమ, రక్షణ అనే కుట్రని. అవును నిజం ..మీరు చెప్పినవన్ని ,ఎంత మూర్ఖం గా, ఎన్ని యుగాలుగా నమ్మి వారిని కాపాడుతునామో. అంతులేని బాధ, థుఖం కలుగుతాయి నాకు ,మన మీద జరిగిన ఈ కుట్ర తలుచుకుంటే. మనహ్పూర్వక ధన్యవాదాలు మీకు.. మీ పరిచయం ఇక్కడ కలిగింది.. బాగుంది.
      వసంతం.

      తొలగించండి