"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

11 మార్చి, 2013

చదువు...



నెత్తి మీద నీటి కుండ తొణికిసలాడే నీరు 
తడిసిన నీ గౌను, చిరుగుల పువ్వుల కుట్టు 
తొణకని నీ చిరునవ్వు, పంటి కింద తొక్కి పట్టి 
నీటి బింది మోత బాధ.. అడుగుల వడి ... ఒక జడి 

పాతాళం లో దాక్కునా సరే ,అమ్మ అంది ఒక్క 

బింది నీళ్ళు పిల్లా , పొయ్యి మీద వన్నం ఎట్టా వండను?
అ ,ఆ ,అంటూ పలక మీద అచ్చరాలు ,పలకరించి 
పిల్ల మనసు కదిపి ,కలిపాయి ,ఊహల బడి లో 

అన్న వొద్దు ,వోద్దు  బడి వొద్దు ,అంటూ పెంకితనం 

మారాము, అమ్మ గడ్డం కింద చేతి పెట్టి గారాము, గారం .
మన ఇంటా ,వంటా ఎవ్వరూ బడి గుమ్మం ఎక్క లేదు 
నువ్వు చదవాలిరా , మంచి చదువు అంటూ .. 

అమ్మా నేనూ బడి కి పోతానే అంటూ మారాము 

గుడిస్తే ,రెండు దెబ్బలు  వీపు మీద ముద్దుగా 
మరి పొయ్యి కింద కంప ఎవరు తెస్తారు ?
మరి పొయ్యి మీద వన్నం కి నీళ్ళు ఎవరు తెస్తారు? 

అమ్మా అంటూ కళ్ళు నులిస్తే , చిన్నపిల్లవా ? 

పదేళ్ళు వచ్చాయి, ఇంక పెళ్లి చేసే వయసు, 
నా చేతి కింద పని నేర్చుకో, మన బతుక్కి 
చదువు ఒక్కటే తక్కువ, బాసన్లు తోము ఇలా 

అంటూ అమ్మే ,బడి గుమ్మం నాకు కల లో 

కూడా దూరం చేసింది, నా వేళ్ళు ,గుండ్రం గా 
ఇసకలో కూడా అ ,ఆ లు రాస్తూ ఉంటాయి . 
ఇంకా ఎంత చదువు ఉంది సుమీ ?? ఇంకా ఎంత ??

నా ఒంటి మీద గౌను చిరిగి పోయింది అని అల్లా 

అమ్మ ఒక పాత గౌను ,తన పాపది అంటూ 
నన్ను పిలిచి ఇచ్చింది, అమ్మా, నాకు గౌను వద్దు 
చదువు కావాలి అని చక్కగా అడిగేను, మరి ఆ అమ్మ 

చదువు చాల ఖరుసు , మీ అమ్మ ,నే అడుగు అంది 

నేను నీళ్ళు పోస్తాను, కంప తెస్తాను అమ్మా మీకు 
నాకు చదువు చెప్తారా? నాకు ..??
అని అడిగితే ...  గుండె చెరువయ్యింది,

చదువు ,ఖరుసు , చదువు ఆడ పిల్లలకి లేదు 

చదువు అందని ద్రాక్ష పండు ,ఇంకానా 
ఈ భారత దేశం ? లో ఇంకానా ? అంటూ .. 
ఆమె గుండె చెరువయ్యింది,

పాప అంటే ఇంటి పని, వంట పని 

ఎన్నాళ్ళు? చదువు అంటే వికాసం అని 
చదువు అంటే విజయం అని, చదువు అంటే 
శక్తి అని, చదువు అంటే తలుపులు తెరవడం అని .. 

















కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి