"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

4 మార్చి, 2013

వెలుతురు కను రెప్పలపై దాస్తాను ...

వెలుతురు కను రెప్పలపై దాస్తాను 
తలుపులు తెరిచి కిరణాలని ఆహ్వానిస్తాను 
నాలుగు గదుల్లో ధారాళం గా గాలి, 
వెలుతురూ ఉందా లేదా అని చూస్తాను . 

చీకటి పడ దానికి ఒక ఘడియ ముందే 
సంధ్యా సమయానికే అన్ని గదుల్లో 
స్విచ్ లు వేసి ,చీకటి ని తరిమి కొడతాను .. 
గది ,గది కి , ఎక్కడా ఒక్క చీకటి గుర్తు 
మిగలకుండా ,తరిమి ,తరిమి కొడతాను .. 

అయినా చిన్నప్పుడే ,ఆటలు ఆడుకునే 
వయసులోనే, బాబూ ,పాపా, చీకటి పడింది 
ఇంక ఇంట్లోకి రండి, అని చీకటి బూచి అని 
భయం మప్పుతాము. ఎప్పుడయినా 
ఊరంతా ఒక్కసారి కరెంట్ పోయినప్పుడు 
కూడా, ఒక కొవ్వొత్తి వెలిగించి ,ఆ చీకట్లోనే 
వెంటనే ,చీకటి ని తరిమేస్తాం .

అయినా ఎందుకో ఎక్కడో కొంత చీకటి 
ఇంకా దాక్కుంది .. 
ఏదో మూల ,నక్కి నక్కి, నాలోనే 
నాకు కనిపించదు ..కాని నాకు తెలుసు 
చీకటి నాలో ఉందని.. 
ఉండుండి నాలోని చీకటి, వెలుతురు  నంతా 
మింగేస్తుందేమో అని నాకు భయం .. 

అందుకే నేనెప్పుడూ ,నిదుర లో కూడా 
ఒక చిన్న రాత్రి బల్బు ని నాకు తోడుగా,
కాపలాగా, అయినా నాలో ఆ చీకటి ,
ఏ క్షణం అయినా నన్ను మింగేయోచ్చు . 
ద్వేషం, అసూయ, కపటం , స్వార్ధం 
ఎన్ని రంగులో ఈ చీకటికి ,నేను ఏ 
క్షణం అయినా ఓడిపోవచ్చు ,చీకటి కి 
వెలుతురూ కి జరిగే యుద్ధం లో ..ఏమో 
ఏ క్షణమో .. అందుకే నేను వెలుతురు ని 
నాకు కాపలా గా పెట్టుకున్నాను .. 

సూర్య కాంతి , నా కనురెప్పలపై 
ఎప్పటికి నిలుపుకుని , చీకటి పై 
నిరంతరం యుద్ధం ప్రకటించాను .. 
గెలుపే  ..ఎవరిదొ.. కాలమే చెపుతుంది . 






కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి