"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

19 మార్చి, 2013

ఒక్కసారి, ఒక్కసారి ..


ఆమె అడవిని జయించిందా? 
ఏమో  కాని, ఇంటి నాలుగు గోడలి ని ఎప్పుడు వదిలింది కనక?
సూర్య కిరణం ఉత్తినే పచ్చదనం కి భోజనం  అందిస్తుంది ట 
ఒక్క రోజు మబ్బు పట్టిన  ఒక్క రోజు కి సెలవు చీటి పంపిస్తుంది. 
ఆమె కి ఒక నాలుగు గదుల ఇల్లు ఇచ్చి ఇక నీదే ,నీదే ఈ రాజ్యం అన్నారు. 
నువ్వే ఈ రాజ్యానికి రాణి వి అన్నారు. కామోసు అనుకుంది .

ఒక్క రోజు నాకు ఏదో నొప్పి, తెలియని బాధ , పడుకుంటే తగ్గుతుంది 
మహా రాణి లా పడుకో ,దానికేం భాగ్యం ? ఇదిగో మా నలుగురికి 
వండి పెట్టి , లంచ్ బాక్ష్ లు సర్ది పెట్టి , ఇల్లు కాస్త సద్ది పెట్టి , 
నీ ఇల్లే కదా, అదే నీ రాజ్యమే , ఎలా ఉండాలి మరి, అద్దం లా మెరుస్తూ 
ఏమండి, ఇవాల్టికి సెలవండి , అన్నవూ ,సరిగ్గా నాకు మా ఆఫీసు లో 
మహా బిజి అయిన రోజే , నువ్వు కూడా ..నువ్వు కూడా నా ??

పిల్లల చదువు, ఫస్ట్ రావాల్సిందే సుమీ ,ఆడ పిల్లని ఎలా పెంచాలో నీకు ఆ 
నేను చెప్పాలా ఏమిటి? నీకు తెలియదు, మగ స్నేహితులేమిటి 
అసయ్యం గా 
మన అబ్బాయికి ఉన్నారు కదండీ ,స్నేహితులు కి ఆడా మగా ఏమిటి ?
నువ్వు ఎలా పెరిగావూ ? కాని, నేను మా అమ్మ ని కాదు ,నేను ఈ కాలం అమ్మని కదా 

ఏ కాలం అయితే ఏమిటి? ఆడ పిల్ల ఆడ పిల్లే అక్కడ పిల్ల, ఒక్కరు వేలెత్తి 
చూప కూడదు .మన అబ్బాయి కేం లోటు? దర్జా గా తిరగనీ , 
మగవాడు తిరగక  చెడాడు అనే మాట వినలేదూ నువ్వు.. అవ్వ.. 
నువ్వు పెరిగావు కాని, మనిషివి ,అన్ని నీకు నేనే చెప్పాలి .. 

అనంతం గా ఆమె కి ఎలా తినాలో, ఏం తినాలో, ఎలా ఉండాలో 
ఎలా కాపరాలు చేయాలో, పిల్లల్ని ఎలా పెంచాలో ?
అన్ని చెపుతూనే ఉన్నారు .. 
ఒక్కసారి ,ఒక్కసారి, ఆమె ని ఆలోచించి ,తన జీవితం తనని 
బతకనిచ్చి చూడండి , ఒక్కసారి, ఒక్కసారి .. 



4 కామెంట్‌లు:

  1. ఒక్క రోజు నాకు ఏదో నొప్పి, తెలియని బాధ , పడుకుంటే తగ్గుతుంది
    మహా రాణి లా పడుకో ,దానికేం భాగ్యం ? ఇదిగో మా నలుగురికి
    వండి పెట్టి , లంచ్ బాక్ష్ లు సర్ది పెట్టి , ఇల్లు కాస్త సద్ది పెట్టి ,
    --------------------------------------------------
    ఇది నిజమే గానీ అంత సూటిగా ఎప్పుడూ చెప్పలేదు. అయినా జరిగేది అదేలెండి మహారాణి వారికి అది ఒక ముఖ్య భాధ్యత కదా మరి..

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Rao S Lakkaraju garu,

      ఉద్యోగికి అయినా సెలవు ఉంటుంది కానీ ,ఈ మహారాణి కి మటుకు సెలవు ఉండదండి , బాధ్యత ఉంటుంది కాని, హక్కు ఉండదు..అదేనండి తేదా.. ఆలోచించండి.. మీకే అర్ధం అవుతుంది.. మీకూ అర్ధం అవుతుంది. ధన్యవాదాలు . మీ అభిప్రాయం రాసినందుకు ..
      వసంతం.

      తొలగించండి
  2. ఒక్కసారి ,ఒక్కసారి, ఆమె ని ఆలోచించి ,తన జీవితం తనని
    బతకనిచ్చి చూడండి , ఒక్కసారి, ఒక్కసారి ....... అలా బతకనిస్తె ఎమైతదో చలం చూపించాడు. అందుకే ఈ (మా) మగ వాళ్ళకి భయం... "పక్షిని పంజరంలో ఉంచకు. అలా ఉంచుతే అది ని మీద ఇష్టం వల్ల ఉంటుందా లేకపోతే గత్యంతర లేక ఉంటుందా తెలియదు. దాన్ని పంజరంలోంచి వదిలై, అది ఎగిరిపోయింది అనుకో దానికి నీ దగ్గర ఉండటానికి ఇష్టం లేదని అర్థం...ఒకవేళ ఎగిరిపోలేదనుకో అది స్వేచ్చగా ఎప్పటికి నీ దగ్గర ఉంటుంది".

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అవును ,స్వేచ్చ గా ఆమె ఆ పంజరం లో ఉంటుందా ఉండదా ? అని ఎప్పుడూ అనుమానమే అందుకే ఇన్ని గోడలు, ఈ పంజరాలు. వారి మనసులో స్వార్ధం ,వారికి చెపుతూ ఉంటుంది, ఆమె ఎప్పటికి తిరిగి రాదు. అవును నమ్మకం గా తెలుసు, యే జీవి అయినా స్వేచ్చ కోరుకుంటుందని.. బాగా చెప్పేరు డేవిడ్ ..నిజం..ఆ మాట..చలం ఒక్కరికే స్త్రీ పడే యాతన బాధ అర్ధం అయింది..

      వసంతం.

      తొలగించండి