"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

3 మార్చి, 2013

పెద్ద అబద్ధపు వల ఇది. ...

నిన్నటి కవిత లు నిన్న అంటే నిన్న కాదు 
మొన్నో ,అటు మొన్నో, ఏళ్ళో క్రితం 
రాసుకున్నా, రాసి, దిండు కింద పెట్టుకుని 
కలలు కన్నాను, అంతా సరి అయిపోతుంది ,
ఉదయం అయితే చాలు ,ఈ చీకటి ,ఈ పోరు 
పోయి అంతా బాగయిపోతుంది అని గుడ్డి 
కలలు కన్నాను.. మెలకువ వచ్చిన్ది. 

ఇప్పుడు , అంతా అలాగే, దోపిడీ ,కుట్ర 
పిరికితనం, పేదరికం , ఆశ , అధికారం 
తో చేసే అనధికార పెత్తనం ,అంతా అలానే 
ఉంది, ఇలాగే ఉంటుంది అని కూడా 
తెల్సినా ,నేను ఏమాత్రం వెరవను .. 

నేను ఇలాగే నాలుగు అక్షరాలు ప్రోది చేసి 
ఒక ఆశల హర్మ్యం నిర్మిస్తూ ఉంటాను ,
ఇసకతో ,ఇసక లో కట్టే ఆ భవనం , ఇలాగే 
కూరుకుపోతూ ఉంటుంది, నేను ఇంకా 
మేడ ,మిద్దె నిర్మిస్తూ ఉంటాను ,భలే 

పెద్ద అబద్ధపు ఒడ్డుకి చేరిన నావ ఇది. 
పెద్ద అబద్ధపు వల ఇది ..కన్నాల తో 
చేసిన వల ఇది.  కలలు జారి పోయే 
వల ఇది.. పెద్ద అబద్ధపు వల ఇది. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి