"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

15 మార్చి, 2013

కె జి హెచ్

ఇన్నేనా ? అంటే ఇంకా చాలా ఉన్నాయి అన్నట్టు .. 

మా తూర్పు వాళ్లకి పెద్ద దిక్కు అయిన కె జి హెచ్ ఆవరణ లో ఒక పురాతన మర్రి  చెట్టు, సాయంత్రం అయిందని చెప్పేందుకు ,దాని మీద చేరిన వందల, వేల పక్షుల కిచ కిచ లు ,మన మాట మనకి వినబడనంత , పెద్ద గా ... 
ఆ పక్కనే అజంత హోటలు, రవ్వ దోసే దాని స్పెషాలిటీ , ఒక గుండ్రని ,పాల రాయి బల్ల ,దాని చుట్టూ ,మెడలో పాము లాగ స్టేత్ లు ధరించి, తెల్ల కోటు చేతి మీద అదో ఆభరణం లా మెడికో లు కాఫీ లు లాగిస్తూ, రోగులు, రోగి చదువుల నించి కాస్త ఉపశమనం కోసమా అన్నట్టు .. 

అలా మరో రెండు వీధి లు దాటి వెళితే ,  కె జి హెచ్  గోడ వెంబడి, సరిగ్గా రెండో వీధి .. ఒక పెద్ద అప్పు ,అంటే ఆంగ్లం లో అప్ ,కనిపిస్తుంది, అలా కిందకి దిగితే అల్లా సంపంగి చెట్టు వారి ఇల్లు పక్కనే మా ఇల్లు. .. 

వరసగా రైలు పెట్టె లా గదులు, ఒక పెద్ద గది కి మూలగా అమర్చిన మరో రెండు చిన్న కొట్టు గదులు అనే వాళ్ళం, మధ్యలో ఒక మండువా ,అంటే ఆకాశం కనిపిస్తూ, వర్షా కాలం లో ,ఇంట్లో నే గొడుగు పట్టాలి అన్న మాట .. ఆ మండువా నిండి ఒక వేపు మెట్లు , ఆ మెట్లు ముందు ఒక్క వరసే , మధ్యలో ద్వైతం ,అద్వైతం లా రెండు గా చీలి పోయి, ఒకటేమో చిన్న డాబా మీదకి, మరోటి, పెద్ద డాబా మీదకి .. ఎన్ని ఆటలు ఆడామో అక్కడ .ఒక జీవితానికి సరి పడా .. 

మండువా దాటి ముందు కి వెళితే వంటిల్లు,ఆ  వెనక ఒక చిన్న వంటిల్లు ,అక్కడ మట్టి పొయ్యి, శుబ్రం గా అలికి ఉండేది, పెద్ద వంటింట్లో ,పొద్దున్న వంట కి వాడిన  కట్టెలు మిగిల్చిన బొగ్గులు కుంపటి లో వేసి, సాయంత్రం తేలిక వంట, కాఫీ లు కోసం .. 

ఇంత కన్నా పర్యావరణం కి చేసే మేలు ఉంటుందా?? వాడి, మళ్లీ వాడి ,ఏది పారేయకుండా, మనకి ప్రకృతి ఎలా ఇస్తే  అలాగే వాడే పాత రొజులు. 

నేను మా మామ్మ, తాతగారు ,మా అత్తా , చిన్నాన్నలు ఉండే వాళ్ళం ,ఈ ఇంట్లో .. 

మా నాన్నగారు, అమ్మా, మిగిలిన పిల్లలు, అందరూ పుట్టలేదు ఇంకా ,చిట్టి వలస లో ఉండే వారు. ఆయనకీ అక్కడ ఉద్యొగమ్. జూట్ మిల్ లో 

మా మామ్మ కి కులగోత్రాలు సినిమా కి వెళ్లి వచ్చిన మర్నాడే , పక్ష వాతం వచ్చి పడిపోయింది .. ఆరు నెలలు ఆ  కె జి హెచ్ ఏ ఆమె కి ఇల్లు అయిపోయింది . 

మంచి మందులు ఉండేవి కావేమో మరి.. 

ఉదయమే కాఫీ ఫ్లాస్క్ లో పోసి ఇస్తే ,అక్కడ రాత్రి పడుకున్న వారికి ,మా అమ్మే ఎక్కువగా , మా మామ్మ కి ఇక్కడున్నట్ట్టు గా గబగబా పరుగు పెడుతున్నట్టు నడుచుకుంటూ వెళ్లి ఇచ్చి రావడం నా పని. 

సన్న గా అర్భకం గా ఉండి  పొడుగు గౌను వేసుకుని, రివ్వున బయలు దేరాను ఒక రోజు . తీరా బయలు దేరే ముందు చూసుకున్నాను , చెప్పులు లో ఒకటి తెగిపోయింది . 

కేరే జాట్ అనుకుంటూ, అలాగే నడుచుకుంటూ ,వెళ్లి ,భావ్ నగర్ వార్డు లో ఉన్న మా వాళ్లకి కాఫీ అందించి, బడి కి సమయం మించి పోతోంది అని ,మళ్లీ ఎగరేసిన గాలి పటం.. .  అతి వేగం గా కిందకి దిగిపోతున్న గాలి  పటం  లా అన్న మాట వెనక్కి వస్తూంటే , వెంకట రమణి అనే నా క్లాస్ మెట్ తల్లి ఒక డాక్టరు .. ఆవిడ కి నేను తెలుసు.. కారు ఆపి, అయ్యో చెప్పులు లేకుండా ఆసుపత్రి కి వచ్చేసావా ? నీకు తెలియదా ? చాల జబ్బులు ఉంటాయి కదా ,ఇక్కడ ,ఇప్పుడు ఎలా ? ఇంటికి వెళ్లి శుభ్రం గా కాళ్ళు కడుక్కో , ఇంకెప్పుడూ ఇలా రాకు సుమీ , అని చెప్పి ,చాల బాధ పడుతూ , ఆమె వెళ్లి పొయిన్ది. 

నాకు తల తీసేసినట్టయింది .. ఎంత అవమానం ? నేను ఒక్క మాట మాట్లాడ లేదు . చాల బిడియస్తురాలిని .. ఈ రోజు నా తరగతి లో అందరూ ఇదే చెప్పుకుంటారు . తప్పదు .. అనుకుని , ఇంటికి వెళ్లి ,అప్పటికప్పుడు నాకు జోళ్ళు కొనండి అని పేచి పెట్టి కొనిపించుకున్న గుర్తు. 

ఈ రోజు నా చెప్పులు, అన్ని రంగులలో ,నడక కి రెండు రకాల ఖరీదయిన షూస్ , వేళ్ళు మూసి ఉంచే వి, పూర్తిగా తెరిచి ఉండేవి ,ఇన్ని రకాలు ఒక అలమార నిండా నా చెప్పుల జతలే .. 

అయినా ఎందుకో ,ఆ రోజు , ఆ ఒక్క రోజు నేను చెప్పులు లేకుండా నడిచిన ఆ రోజు ,ఆ అవమానం , ఆ  పసి మనసు పొందిన అవమానం, సిగ్గు, ఇంకా ఇన్నేళ్ళ తరవాత కూడా , ఎంత కష్టం గా ఉంటుందో ??

ఇన్నేళ్ళు పొందిన సుఖాలు, ఆనందాలు ,ఆ ఒక్క  క్షణాన్ని ఎందుకు తుడిచే య లేక పోతున్నాయి ? 

అంటే సుఖం కన్నా బాధే .. తీవ్రమయినది.. గుర్తు ఉండి పొయేది. 
మరి జీవితం లో అంతా సుఖాలే ఉన్న వారికి ,ఈ బాధ ని తడుముకుని పొందే సుఖం ఉండదు కదా..... ఏమో అలా తోస్తుంది నాకు . 






4 కామెంట్‌లు:

  1. ఇన్నేళ్ళు పొందిన సుఖాలు, ఆనందాలు ,ఆ ఒక్క క్షణాన్ని ఎందుకు తుడిచే య లేక పోతున్నాయి ?
    -----------------------------------------------------------
    మన మనస్సు బాధలని మాత్రమే ఎక్కువగా గుర్తు పెట్టుకుంటూ ఉంటుంది, కారణం మళ్ళా మనకి(శరీరానికి) ఆ బాధలు పడకుండా ముందరే గుర్తు చెయ్యటానికి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Rao S Lakkaraju గారు, ధన్యవాదాలు అండీ మీ అభిప్రాయాం ఓపికగా రాసినందుకు .
      శరీరం కున్న మెలకువ , బాధ మళ్లీ కలుగుతుంది అన్న గుర్తింపు ఒక రకం ..
      అవును శరీరం కి కూడా మెమొరి ఉంటుంది,మనం టెలెఫొన్ నంబెర్ చెప్పమంటేచెప్పలేం కాని మనం వేలి తో చేసే టెలెఫోన్ డైలింగ్ మనం డైల్ చేయగలం ,తడుము ఖొకుండా ..కానీ ఇది ఇంకో రకమయిన లివింగ్ విత్ పైన్ లాంటిది. బాధే సుఖం అనుకొవొయ్ లాగా..

      థాంక్స్ మళ్లీ మరో సారి.

      వసంతం.






      వసంతం.

      తొలగించండి
  2. సుఖం కన్నా బాధే .. తీవ్రమయినది.. గుర్తు ఉండి పొయేది.
    మరి జీవితం లో అంతా సుఖాలే ఉన్న వారికి ,ఈ బాధ ని తడుముకుని పొందే సుఖం ఉండదు కదా..... ".బాధ ఒక్కొసారి వేదన కలిగిస్తుంది...మరో సారి విచ్చుకునే మొగ్గవుతుంది".

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ".బాధ ఒక్కొసారి వేదన కలిగిస్తుంది...మరో సారి విచ్చుకునే మొగ్గవుతుంది"
      కరెక్ట్ గా చెప్పేరు.. అవును బాధ కూడా ఒక్కొసారి విచ్చుకునే మొగ్గ అవుతుంది.
      వసంతం.

      తొలగించండి