"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

21 మార్చి, 2013

నా కవిత ..

ప్రతి కిరణం ఎద మీద 
సంతకం చేసి , పదాలు చేతికి 
అందిస్తోంది, చీకటి తరిమేసాను 
ఇంకా రాయవేం ? అని . 

భావాలు కి తగ్గ పదాలు 
కోసం ,అలా ఓ మారు షికారు వెళ్లి 
వచ్చాను,  ప్రతి దుకాణం మూసేసి 
ఉంది, పదాలు అమ్మే దుకాణాలు . 

బాగా నగిషి పెట్టి , నక్షత్రాల లాగ 
చమక్ చమక్ అని మెరవాలి 
మెరుపు లాగ చదివే వారి కి 
షాక్ కొట్టాలి ,అంటే స్పృహ లోనే 
ఉంటూ , నా కవిత ని మెచ్చాలి . 

వీలయితే కవిత వారికి 
చప్పరిస్తూంటే పిప్పరమంటు  
లాగ జివ్వున హాయిగా 
ప్రాణాలు తొడెయాలి. 

కవితా దాహం తీరి తీరనట్టు 
కోకో కోలా లో గాస్ లాగ 
గొంతు వరకు పట్టేయాలి 
దప్పిక తీర్చీ తీరక , 
ఒక నషా లో తేలుతూ ఉండాలి . 

నేను పిలవగానే జీ హుజూర్ 
అంటూ చేతులు కట్టుకుని 
నా ఎదురుగా చేతులు నలుపుకుంటూ 
కవిత  వినయం గా ,భూతం లాగ .. 

నా పిలుపు ని మన్నించే కవిత 
శిల్పం, పద అమరిక , జిలుగు 
జిలుగు మని అలంకరించుకుని 
ఎప్పుడెప్పుడు వస్తుందా ? అని 

ఈ లోగా నేను అలా వెళ్లి ఏవో 
నాలుగు కథలు ,కాకరకాయలు 
కోసుకు వస్తాను, చేదుగా ఏదో 
వండి పెట్టేస్తా ,సరే కాని. 





6 కామెంట్‌లు:

  1. చేదుగా ఏదో
    వండి పెట్టేస్తా ,
    ------------------------
    తినగ తినగ చేదు తియ్యనగును. వ్రాయగా వ్రాయగా --------------------.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Rao S Lakkaraju gaaru,

      ధన్యవాదాలు.. మీ అభినందనలకు ..
      మీ ఆశీస్సులకు
      వసంతం

      తొలగించండి
    2. kavitvam meeda kavitvam koodaa kavitvame!Prapancha kavitha dinotsava sandarbhamlo manchi paakam kudiri baaga ruchikaramga rasaramyamga chavuloorinchindi!mee kavanam bahu sundaramuga amarindi!jayaho!kavitvam ajaraamaram!

      తొలగించండి
    3. A.Surya Prakash Garu ,
      ధన్యవాదాలు ,అవుననండీ , ఈ రోజు ప్రపంచ కవిత దినోత్సవం ,ఆ సందర్భం గా నే కవిత ని ఆహ్వానిస్తూ రాసేను. మీకు నచ్చినందుకు సంతోషం అండీ.

      వసంతం.

      తొలగించండి
  2. "షాక్ కొట్టాలి ,హాయిగా ప్రాణాలు తొడెయాలి, నషా లో తేలుతూ ఉండాలి, నా ఎదురుగా చేతులు నలుపుకుంటూ"..... ఇవన్ని మీ కవిత దాటేసింది కాని ఎవో కోసుకు వస్తా అన్నారు గా అదేదో కోసుకు రాండి...అన్నట్లు చేదు మాత్రం వద్దు. .ఇప్పటికే జీవితం చేదుతో నిండి పోయింది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హా హా హా ...కాకర కాయలో ,కథలో ఇంకా నిర్ణయించ లేదు మరి.
      చిరు చేదు కూడా ,ఉగాది పచ్చడి లో ఒక రుచి మరి.
      చూద్దాం, ఈ ఉగాది ఏం తెస్తుందో మన జీవితాలకి. థాంక్ యూ డేవిడ్
      వసంతం.

      తొలగించండి