"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

13 మార్చి, 2013

ఈ తిరిగే భూగోళం ....

భూమి గుండ్రం గా ఉంది ట ,
కనుచూపు మేరా బల్ల పరుపుగా భూమి 
నన్ను సవాలు చేస్తూ , ఏది చూడు 
నా గుండ్రని ,గుండ్రటి గుండ్రాయి లాంటి 
నన్ను చూపు అని .. 

ఎంత దూరం వెళితే ,భూమి చివర వస్తుందో? 
ఎంత దూరం వెళితే ఆ చివర నించి తొంగి 
చూడచ్చో, రోదసి లో పడొ చ్చా? నా చేతిలో 
వస్తువులు , అమ్మో, నన్ను కట్టి పడేసే 
ఆకర్షణ  శక్తె లేక పోతే ,అంతే గా మరి . 

ఇలా ఎవరు సృష్టించారు ఇంత గమ్మత్తుగా 
ఇలా ఎవరు అనుకున్నారు ఇంత ముందుగా 
ఈ గోళం పేరు భూమి అని ,ఇది మనుషులకి 
నెలవు అని, రెండు కాళ్ళ మీద నిలబడమని 

నీ గరిమనాభి నీలో నే పెట్టి, నీ కుదురు కి 
నిన్నే బాద్యుడిని చేసి, నీ శరీరం లో ఇంత 
అవయవాను రూపత్వం ఇచ్చి ( సిమ్మెట్రి )
నీ బుద్ధి ని గట్టి కపాలం లో దాచి ,

నీ చూపు కి కను గోళం అమర్చి , నిన్ను 
ఎంత సుందరం గా అమర్చారు ఎవరో ?
నీ మనసు కి మటుకు ఎక్కడా ఒక 
అవయవం లేదు కాబోలు, కుప్పి గెంతులు 
వేస్తూ , అక్కడక్కడ తిరుగుతుంది . 

అంత టా సమ తుల్యం , భూమి నిన్ను 
సమం గా నిల బడుతుంది ,నిన్ను ముద్దు బిడ్డ 
లాగే సాకుతుంది, నువ్వు ఆ తులన ని 
నీ చేతులారా అపహాస్యం చేసి , తోస్తే .. 

ఇంక నువ్వు ,ఆ భూగోళం అంచు చూసినట్టే .. 
నువ్వు నీ గోతి నువ్వు తవ్వు కున్నట్టే .. 
నరుడు చూపు తగిలితే చాలు రాయి పగుల్తుంది ట ,
నీకు నువ్వే దృష్టి ,నీకు నువ్వే చెడు చూపు .

నిన్ను మోస్తున్న ఈ పృథ్వి కి రోజూ ఒక 
తల ఒంచి రోజూ ఒక వందనం చేయి .. 
నిన్ను భారం అని ఏనాడు అనుకోని నీ 
తల్లి లాంటిదే కదా ఈ భూమి, ఈ గుండ్రని భూమి .. 
సలాం ,నమస్తే, ప్రనామ్ ... ఏ భాష లో అయినా సరే 
శిరస్సు వంచి ,నిన్ను మోస్తున్న భూమి ని చూడు .. 
రోజు కి ఒక్కసారి.. 

ఎంత గాలి మేడ లో ,ఏదో అంతస్తు లో నివసించినా 
ఒక్కసారి ,రోజు కి ఒక్కసారయినా నువ్వు నీ 
అంతస్తులు దిగి వచ్చి ,పుడమి మీద కాలు పెట్టాలి .. 
నీ కాలి కి అంటిన మట్టి , నీకు నీ తల్లి పేగు లాంటిది. 

ఈ గోళం లో ,నిట్ట నిలువుగా నిన్ను పాతిబెట్టినా 
ఆరడుగులు చాలు ట ,ఇంకా ఎందుకు వ్యామోహం ?
తరాలు ,తరతరాలు ఖర్చు పెట్టినా తరగని ఆస్తి హుమ్.. 
ఎందుకు ? ఇవ్వడం లో ఉన్న హాయి ,తవ్వి వెనక 
వేసుకోవడం ? లో ఉందా ? కంటినిండా కరువైన కునుకు తప్ప. 

గుండ్రం గా ఉన్న ఒక చిన్న రబ్బరు బంతి ని చేతి తో 
నొక్కుతూ ఉంటే ,హాయిట .. నీ మనసుకు , చూసావా 
గుండ్రం గా ఉన్న చిన్న వస్తువు కూడా నిన్ను భూమి 
గోళం ని గుర్తు చేస్తోంది ... భూగోళం తన చుట్టూ తానూ 
తిరుగుతూ ,నిన్ను నిలబెడతోంది . కొంచమైనా నేర్చుకోవా ?
ఈ తిరిగే భూగోళం నించి ????






కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి