"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

19 మార్చి, 2013

కొన్ని సత్యాలు ..

పిచుక లని కాపాడుదామ్.. 
మొబైల్ ఎస్ ఎమ్మెస్ వచ్చింది 
అలాగే కాపాడదాం  అంటూ 
తిరుగు సమాధానం మరో 
ఎస్ఎమ్మెస్ వెళ్ళింది , సెల్ 
ఫోన్ టవర్ విలాసం గా నవ్వింది 
మూర్ఖులు మానవులు అని . 


పులులు అంతరించి పోతున్నాయి 
ఇదిగో తోక అంటే అదిగో పులి అని 
భయం తో వణుకు పుట్టి ,పారి పోయే 
పిరికిపందలు కూడా ఇదే మాట . 
పులులకు పెద్ద ,పెద్ద అడవులు 
సేకరించండి ,అంటూ సంతకాల 
సేకరణ, ఆ అడవి ని నమ్ముకున్న 
ఆటవిక మనుషులా ? పోతే పోతారు .. 
మనిషా ? పులా ? అడివా ?? ఏది 
ముఖ్యం, మనం వర్ధిల్లాలి అంటే ,మరి 
చిన్న ప్రాణులు ,నశిస్తాయి అనే 
ప్రాధమిక ఆటవిక న్యాయం వినలేదూ ?


అమ్మో , ముప్ఫై ఏళ్ళు .... కిందకి వచ్చాయి 
మా వాడికి ,ఇంకా పెళ్లి చేద్దాం అంటే పిల్ల 
ఆడ పిల్ల దొరకటం లేదు . . ఎంత కలి కాలం ?
ఏమయారు ? ఆడ .... ? ఎక్కడికి పోయారు 
అందరూ కట్ట కట్టుకుని, నువ్వే కదా మరి 
మూడో నెల లోనే ,లింగ నిర్ధారణ పరీక్ష చేసి 
తీయించి ,కడిగించేసావు కదా ఆమె గర్భ సంచి ,
మరో మగ వెధవ పుట్టే వరకు నా మొహం చూడకు 
అని ఉరిమి ,కన్నీరు తెప్పించింది నువ్వే కదా ?

అయ్యో, ఎంత పని చేసాను ? ఇప్పుడు 
రాజకీయాల్లో రిసెర్వేశను ఇచ్చేసారు ,
మన ఇంట్లోనే పడి ఉండేదే ,ఈ పదవి 
కల కాలం . . ఆడ పిల్లని కని ఉంటె సరిపోయేదే 
నువ్వు, నేను ఏదో మాట వరసకి అంటే ,నువ్వు 
ఆడ దానివి ,నా మాట వినేయడమే .. 
అందుకే తెలివి లేదు , మీకు చిన్న మెదళ్ళు మీరూ ను 
చ, ఇంతకి మా వాడికి పెళ్లి చేద్దాం అంటే ఒక్క 
ఆడ కూతురు కనిపించదేం ? 

నువ్వు తీసుకున్న గోతిలో నువ్వే పడతావు 
అని ఎవరు చెపుతారో? ఆమె ఎప్పటిలా నోరు 
మూసుకుని, తరవాత మాట ఏం  చెప్తాడో అని 
ఎదురు చూస్తూ, ఎప్పుడు ఆమె నోరు విప్పి 
ఎదురు సమాధానం చెపుతుందో ??
ఆ రోజే మరి , వాడికి ,ఆ అధికారం చేతి కర్ర 
ధరించిన మగ వాడికి , ఓ కర్ర సమాధానం .. 
ఎప్పుడో మరి.. తప్పదు ...ఎప్పుడో , ఒకప్పుడు .. 











2 కామెంట్‌లు:

  1. ఎప్పుడు ఆమె నోరు విప్పి
    ఎదురు సమాధానం చెపుతుందో ??
    ఆ రోజే మరి , వాడికి ,ఆ అధికారం చేతి కర్ర
    ధరించిన మగ వాడికి , ఓ కర్ర సమాధానం ..
    ఎప్పుడో మరి.. తప్పదు ...ఎప్పుడో......అది త్వరగా వస్తె బాగుండు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. David,
      ఒక మగ వారు అయి ఉండి, ఆహ్వానిస్తున్నారు అంటే ,చాల అభినందనీయం.. అందరూ ఇలా ఆలొచిస్తే ఎంత బాగుంటుంది.. కాని, ఉండరు, ఇలా ఆలోచించరు. ఎంత సేపూ తమ చేతిలో అధికారం ఎలా నిలుపుకోవాలా అనే ఆలొచనలు, కుట్రలు. నిజమే ఆ కర్ర పెత్తనం ఊడ గొట్టే రోజు ఎప్పుడో ..
      వసంతం.

      తొలగించండి